సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మోషన్ కాప్చర్ టెక్నాలజీతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన సినిమా ‘కొచ్చాడియాన్’.
ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఇది కాకుండా రజినీకాంత్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాకి ‘లింగా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రజినీకాంత్ మనవడి పేరు లింగా(ధనుష్ – ఐశ్వర్యల రెండవ కుమారుడు). ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ మే 2నుండి మైసూర్ లో ప్రారంభం కానుంది.
రజినీకాంత్ సరసన సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాలు హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.


