
దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ అవార్డుతో సూపర్ స్టార్ రజినీకాంత్ ను సత్కరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం. ఈ రిపబ్లిక్ డే నాడు పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. 148 మంది జాబితాలో రజినీకాంత్ పేరు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇపతివరకు ప్రభుత్వం ఎటువంటి జాబితాను విడుదల చేయలేదు.
ఈసారి పద్మ అవార్డుల జాబితాలో సినీ ప్రముఖులు ఎక్కువ మంది ఉన్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, దర్శకునిర్మాత సంజయ్ లీలా భన్సాలి, స్క్రిప్ట్ మరియు గేయ రచయిత సలీం ఖాన్ (సల్మాన్ ఖాన్ తండ్రి), నిర్మాత ప్రసూన్ జోషి.. తదితరులు పేర్లు ఆశావహుల జాబితా ఉన్నాయని టాక్.

