మహేష్ బాబు సినిమాలో సూపర్ సూపర్ స్టార్ రజినీకాంత్?

మహేష్ బాబు సినిమాలో సూపర్ సూపర్ స్టార్ రజినీకాంత్?

Published on Jan 12, 2015 3:49 PM IST

rajni-mahesh-babu
టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు నటిస్తేనే చాలు.. ఘట్టమనేని అభిమానులు థియేటర్స్ ముందు బారులు తీరుతారు.. అదే సినిమాలో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తే ఎలా ఉంటుంది.. ఆ సినిమా కోసం అభిమానుల వచ్చే ప్రవాహం సునామీలా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే కాంబినేషన్ త్వరలోనే తెరపై కనిపించనుంది. ఏంటి రజినీకాంత్ – మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీనా.? ఇది నిజమా.? కలా.? అని ఆశ్చర్యపోతున్నారా.? షాక్ నుంచి తేరుకొని మిగతా విషయం చదవండి పూర్తి క్లారిటీ వస్తుంది..

ఇక అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు తన తదుపరి సినిమా శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. పివిపి నిర్మించనున్న ఈ సినిమాకి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. కథానుసారం ఈ సినిమాలో పెదరాయుడు లాంటి పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రకి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ అయితేనే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే శ్రీ కాంత్ అడ్డాల – పివిపి ఈ వారం చివర్లో రజినీకాంత్ ని కలిసి కథ వినిపించనున్నారు. రజినీకాంత్ కథ విని ఓకే చేస్తే ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకి రావడమే కాకుండా మరో క్రేజీ అండ్ మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బ్రహ్మోత్సవం సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్ర టీం అనుకున్నట్టుగానే రజినీకాంత్ తన పాత్రని ఓకే చేసి ‘బ్రహ్మోత్సవం’ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, రజినీకాంత్ – మహేష్ బాబు కలిసి తెరపై కనిపించి ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చెయ్యాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు