
రజినీకాంత్ రాజ్ బహదూర్ ల స్నేహబంధం గురించి తలైవ అభిమానులందరికీ తెలుసు. వారీ బంధం గురించి రజినీ చాలా ఇంటర్వ్యూలలో కూడా తెలిపాడు. అయితే ఇప్పుడు వారిద్దరి స్నేహబంధంపై ఒక సినిమా తెరకెక్కుతుంది. విశేషం ఏంటి అంటే రాజ్ బహదూర్ పాత్రలో స్వయంగా రాజ్ బహదూర్ నటిస్తున్నారు. కానీ రజినీకాంత్ గారి పాత్ర ఎవరూ చేస్తున్నారు అన్నది నిర్మాతలు గోప్యంగా ఉంచారు.
రజినీ సినిమాలలోకి రాకముందు నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు. ఈ సినిమాకి రుషి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి రాజ్ బహదూర్ మాట్లాడుతూ, ధియేటర్ రోజుల నుండి మేమిద్దరం మంచి స్నేహితులమని, మా స్నేహం మీద సినిమా తీయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమాలో తమ స్నేహం ఆరోజు నుండి ఈరోజు వరకు ఎలా కొనసాగుతుందో అనే కధాంశంతో ఉంటుందని పేర్కొన్నారు. తమ స్నేహం మీద ఒక సినిమాను రూపొందిదాం అని అడగగానే రజినీ వెంటనే ఒప్పుకున్నాడని, సినిమా విడుదల అయ్యాక ఇద్దరం కలిసి ఈ సినిమాను చూస్తామని అయన తెలిపారు.

