ఓవర్సీస్ రిలీజ్ కి సిద్దమైన ‘రాజుగారి గది’

raju-gari-gadi
లో బడ్జెట్ లో తెరకెక్కి గత వారం చిన్న సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రాజుగారి గది’. హర్రర్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది. మొదటి సినిమాతో పరాజయాన్ని అందుకున్న ఫేమస్ టీవీ యాంకర్ ఓంకార్ రాజుగారి గది సినిమాతో మాత్రం పెద్ద విజయాన్నే అందుకున్నాడు. విజయం అంటే అలాంటి ఇలాంటిది కాదు తీసిన తనకి, కొనుక్కున్న సాయి కొర్రపాటి, అనిల్ సుంకర మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి బాగా లాభాలను కూడా తెచ్చి పెట్టింది.

ఈ సినిమాకి ఇక్కడ ఇంత పెద్ద హిట్ అయిన్ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో ఓంకార్, సాయి కొర్రపాటి, అనిల్ సుంకరలు ఈ సినిమాని ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అందులో భాగంగానే ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే రాజుగారి గది సినిమాని అక్టోబర్ 30న ఓవర్సీస్ లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో లానే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని, మంచి కలెక్షన్స్ సాధిస్తుందని ఆశిస్తున్నారు.

Exit mobile version