హడలెత్తిస్తున్న రాజుగారి గది 3 ట్రైలర్

Published on Sep 15, 2019 11:34 am IST

‘రాజుగారి గది’ హార్రర్ కామెడీ చిత్రాల సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం రాజుగారి గది3. మొదట రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో దర్శకుడు ఓంకార్ మూడవ చిత్రం రాజుగారి గది3 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటించడం విశేషం. కాగా నేడు ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ హారర్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. మొదటి రెండు భాగాలలో హారర్ కి హాస్యం జోడించి తీసిన ఓంకార్ మూడవ భాగంలో కేవలం హారర్ పైనే ఎక్కువ ద్రుష్టి సారించారనిపిస్తుంది.

మొదటి రెండు భాగాలలో చేసిన అశ్విన్ బాబు మరో మారు రాజుగారి గది 3 లో హీరోగా చేస్తుండగా, బ్రహ్మజీ, ఊర్వశి, ధన్రాజ్, అజయ్ ఘోష్, అలీ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. షబీర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More