చిట్ చాట్ : రాజ్ తరుణ్ – కావాలనే సినిమాల స్పీడ్ తగ్గించాను !

Published on May 26, 2018 3:52 pm IST

యువ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘రాజుగాడు’. ఈ చిత్రం జూన్ 1వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

డైరెక్టర్ సంజనగారు మిమ్మల్ని ఈ సినిమా కోసం ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ?
సంవత్సరం ముందే అప్రోచ్ అయ్యారు. స్క్రిప్ట్ వర్క్ అయ్యాక షూట్ మొదలుపెట్టాం. అప్పుడు ‘అంధగాడు’ వచ్చింది. ఆ తరవాత ‘రంగులరాట్నం’ ఉంది. అందుకే సినిమా వాయిదాపడి ఇప్పుడు విడుదలవుతోంది.

ఇందులో పాత్ర గురించి చెప్పండి ?
ఇందులో నా పాత్ర పేరు రాజు. నాకు దొంగతనం చేసే బలహీనత క్లిప్టోమానియా ఉంటుంది. పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కంప్లీట్ ఎంటర్టైనర్.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ఎలా ఉంది ?
ఇది కలిసొచ్చిందనే చెప్పాలి. ఇలా ఈ బ్యానర్లో వరుస సినిమాలు చేయడం నాక్కూడ సంతోషంగానే ఉంది.

ఈ మధ్య మీ సినిమాల స్పీడు తగ్గినట్లుంది ?
అది నేను తీసుకున్న నిర్ణయమే. ఒకేసారి రెండు సినిమాలు చేయడం కన్నా ఒకదాని తర్వాత ఒకటి చేయడం మంచిది అనిపించింది. అంటే పూర్తి దృష్టి ఒక సినిమా మీదే పెట్టి చేయాలని అనుకున్నాను.

కథల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవడంలో మార్పులేవైనా వచ్చాయా ?
మార్పులంటే కొన్ని వచ్చి ఉండొచ్చు. ఒక తప్పు జరిగితే దాని నుండి నేర్చుకుంటూ ముందుకెళతాం. అలా వెళ్లినప్పుడే సక్సెస్ కాగలం.

మీ హీరోయిన్ అమైరా దస్తూర్ గురించి చెప్పండి ?
మొదట్లో అంతగా కలవకపోయినా ఆ తరవాత నెమ్మదిగా కలిసిపోయాం. ఆమె చాలా ప్రొఫెషనల్. సమయానికి సెట్స్ లో ఉంటారు. ఆమెతో వర్క్ చేయడం చాలా బాగుంది.

మీ ‘లవర్’ సినిమా ఎంతవరకు వచ్చింది ?
చాలా వరకు అయిపొయింది. ఇంకో మూడు రోజుల షూట్ ఉంటుంది. అన్ని పనులు పూర్తవగానే నిర్మాతలే స్వయంగా సినిమా ఎప్పుడో అనౌన్స్ చేస్తారు.

మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు ప్రతాప్ తో ఒక సినిమా ఉంది. వశిష్ట అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాను. ఏ స్క్రిప్ట్ ముందుగా రెడీ అయితే ఆ సినిమా చేస్తాను.

సంబంధిత సమాచారం :