ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది 3’ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. మంచి హైప్ నడుమ రిలీజైన ఈ చిత్రం మొదటిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో వసూళ్లు సాధారణ రీతిలోనే ఉన్నాయి. అయినా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే కాబట్టి రికవరీ వేగంగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకి మూడున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఐదు రోజులకుగాను రూ.4.7 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్లను రాబట్టింది.
ఇక నిన్నటి వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం రూ.6 కోట్లకు చేరుకుంటుంది. కానున ఈరోజు, రేపటితో చిత్రం బ్రేక్ ఈవెన్ దాటిపోయి ప్రాఫిట్ జోన్లోకి వెళుతుంది. ఇక శనివారం, ఆదివారం స్టడీ రన్ దొరికితే కన్సిడరబుల్ ప్రాఫిట్స్ కనబడతాయి. మొత్తానికి ఓంకార్ తక్కువ బడ్జెట్లో సినిమా చేయడం మూలాన మిశ్రమ స్పందన వచ్చినా లాభాల్ని సృష్టించగలుగుతారు.


