తమన్నా ప్రధాన పాత్రలో `రాజుగారిగ‌ది 3` ప్రారంభం.

Published on Jun 20, 2019 1:10 pm IST

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం `రాజుగారిగ‌ది` సక్సెస్ సిరీస్ లో భాగంగా తెరకెక్కతున్న మూవీ `రాజుగారి గ‌ది 3` గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.ఓంకార్ తన సొంత నిర్మాణ సంస్థ ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పైస్వయంగా నిర్మిస్తున్నారు. కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.`రాజుగారిగ‌ది 3`లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, మొదటి రెండు భాగాలలో హీరోగా చేసిన అశ్విన్ ఇందులో కూడా కధానాయకుడిగా చేస్తున్నారు.

ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ ముఖ్యతారాగణంగా నటిస్తున్న ఈ మూవీకి మాటలు సాయి మాధవ్ బుర్రా,సినిమాటోగ్రఫీ చోటా కె నాయుడు,ఎడిటింగ్ గౌతమ్ రాజు వంటి ప్రముఖ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More