రాజమౌళికి సినిమా నచ్చక పోయిన బాగుందన్నాడట !

Published on Dec 24, 2018 12:15 pm IST

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ , రానాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇక రాజమౌళి తెలుగు సినిమాను ఆంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. తాజాగా ఈ ముగ్గురు కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫి విత్ కరణ్’ షో లో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇక ఆ షో లో కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఈ ముగ్గరు ఏవిధంగా సమాధానాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ టాలీవుడ్ లో నీకు నచ్చిన నలుగురు హీరోలు ?

ఎన్టీఆర్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్

రాజమౌళి గారు బాహుబలి లో దేవసేనస్థానంలో అనుష్క కాకుండా ఇంకెవరిని తీసుకుంటారు ?

దీపికా పదుకొణె

రానా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ?

అందుకు తగ్గ సమయం రావాలన్నది నా అభిప్రాయం. నా ఫ్రెండ్స్ ఎన్టీఆర్ , బన్నీ పెళ్లి చేసుకున్నప్పుడు .. (నవ్వుతూ) ఇక నేను వీళ్ళతో ఎలా ఫ్రెండ్ షిప్ చేయగలను అనిపించింది.

రాజమౌళి గారు మీకు సినిమా నచ్చకపోయినా బాగుందని ట్వీట్ చేసిన సందర్భాలు వున్నాయా ?

ఉన్నాయి.

ప్రభాస్ నువ్వు అనుష్క తో డేటింగ్ లో ఉన్నావని వార్తలు వస్తున్నాయి నిజమేనా ?

లేదు. ఏ హీరోయిన్ తోనైనా రెండేళ్లు కలిసి పనిచేస్తే వాళ్ళిద్దరికీ లింక్ పెట్టేస్తారు . తను నాకు బెస్ట్ ఫ్రెండ్ మరియు నాకు ఇష్టమైన సహనటి.

రానా నువ్వు త్రిష తో డేటింగ్ చేశావ్ కదా మరి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ?

త్రిష , నేను ఎప్పటినుండో మంచి ఫ్రెండ్స్. తక్కువ రోజులే డేటింగ్ చేశాం కాని ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.

సంబంధిత సమాచారం :