ఫస్ట్ లుక్ తో రానున్న బెల్లంకొండ !

Published on Apr 5, 2019 5:29 pm IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘రాక్షసుడు’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ ను విడుదలచేశారు. రేపు ఉగాది సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్నారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.

గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయనుంది.

సంబంధిత సమాచారం :