రాక్షసుడు అనుపమా కెరీర్ కు హెల్ప్ అయ్యేనా ?

Published on Apr 21, 2019 8:04 pm IST

హలో గురు ప్రేమ కోసమే తరువాత మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కి పెద్దగా ఆఫర్లు లేకుండా పోయాయి. అయితే ఖాళీగా ఉడడం ఎందుకుని ఇటీవల రాక్షసుడు అనే చిత్రానికి సైన్ చేసింది. ఈచిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం అనుపమా తన పాత్ర కు డబ్బింగ్ చెబుతుంది.

బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. హీరో ,విలన్ ఈ రెండు పాత్రలే సినిమాకు హైలైట్స్. హీరోయిన్ రోల్ కి అంతగా స్కోప్ ఉండదు. మరి ఈ సినిమా అనుపమా కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :