‘రాక్షసుడు’ వెనక్కు తగ్గాడా ?

‘రాక్షసుడు’ వెనక్కు తగ్గాడా ?

Published on Jul 3, 2019 3:01 AM IST

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న కొత్త చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘రాట్చసన్’ సినిమాకు ఇది రీమేక్. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూలై 18న విడుదలచేయాలని నిర్మాతలు అనుకున్నారు. ఆ తేదీని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విడుదల వాయిదాపడేలా ఉందని, కొత్త తేదీ ఆగష్టు 2 అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సినిమాతో పాటే జూలై 18వ తేదీని విడుదల తేదీగా పెట్టుకున్న సినిమాలు ‘ఇస్మార్ట్ శంకర్’ చక చకా పనులు చేస్తూ ప్రమోషన్లకు రెడీ అవుతోంది. కానీ ‘రాక్షసుడు’ మాత్రం విడుదలకు రేడే అవుతున్న ధాఖలాలు లేవు. దీంతో వాయిదా వార్తలు నిజమేననే ప్రచారం బలపడుతోంది. కాబట్టి టీమ్ ఈ విషయంపై త్వరగా స్పందించి వాయిదా వార్తలు నిజమా కాదా అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు