బాలీవుడ్ మూవీ కోసం రిహార్సల్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్ మూవీ కోసం రిహార్సల్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Published on Aug 12, 2014 4:53 PM IST

Rakul-Preet
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ‘కరెంట్ తీగ’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉంది. ఇవన్నీ కాకుండా గత నెల రకుల్ ప్రీత్ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. అప్పటి నుంచి తన ఈ సినిమా కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఈ సినిమాలో తను నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ రావు సరసన నటిస్తోంది. వేల్లిద్దరూ ప్రతి ఆదివారం రమేష్ సిప్పీ ఆఫీసులో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి ‘సిమ్లా మిర్చి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ విషయం గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘ సిమ్లా మిర్చి కోసం గత రెండు నెలలుగా రిహార్సల్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో మా లుక్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ఈ మూవీలో నా మదర్ గా కనిపించనున్న హేమ మాలిని త్వరలో మా టీంతో జాయిన్ కానుందని’ అన్నాడు. ఇటీవలే రకుల్ చేసిన ఎయిర్ టెల్ ప్రకటనతో బాలీవుడ్ ని దృష్టిని ఆకర్షించింది.

తాజా వార్తలు