రకుల్ ప్రీత్ డ్రీమ్ రోల్ ఏదంటే..!

రకుల్ ప్రీత్ డ్రీమ్ రోల్ ఏదంటే..!

Published on Jul 26, 2015 11:31 AM IST

RAkulpreet
తెలుగు సినీ పరిశ్రమలో తాజా సంచలనంగా మారిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మొదట వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన ఈ హీరోయిన్, అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన రకుల్, తెలుగులో వరుసగా వచ్చిపడుతున్న అవకాశాలను చూసి సంబరాల్లో మునిగిపోయింది.

తాజాగా ఓ మీడియా సమావేశంలో తన డ్రీమ్ రోల్ గురించి ప్రస్తావిస్తూ రకుల్, జీవితంలో ఒక్కసారైనా అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ అంతలా ఇష్టపడ్డ పాత్ర ‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్ చేసినది కావడం విశేషం. ఆ సినిమాలో తన పాత్రకు కంగనా రనౌత్ నేషనల్ అవార్డు సైతం పొందిన విషయం తెలిసిందే! ‘క్వీన్’ సినిమా తనకు విపరీతంగా నచ్చిందని, అందులో కంగనా రనౌత్ చేసిన తరహా పాత్రే తనకు డ్రీమ్ రోల్ అని రకుల్ తెలిపింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కిక్ 2’ ఆగష్టులో విడుదలకు సిద్ధం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు