రకుల్ ప్రీత్ సింగ్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా ?

Published on Jun 29, 2021 5:02 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హవా ఈమధ్య కొద్దిగా తగ్గింది. చేసిన కొన్ని సినిమాలు పరాజయం చేందడంతో కెరీర్ స్లో డౌన్ అయింది. అలాగే బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో కూడ పెద్దగా సినిమాలకు సైన్ చేయలేదు. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో కథానాయకిగా నటిస్తోంది రకుల్. ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది. ఇటీవల నితిన్ హీరోగా చేసిన ‘చెక్’ పరాజయం చెందింది.

ఇక తమిళంలో రకుల్ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఇవి మినహా ఆమెకు దక్షిణాదిన ఆఫర్లు లేవు. కానీ హిందీలో మాత్రం ఆమెకు ఒక పెద్ద ఆఫర్ తగిలినట్టు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ తివారీ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ దర్శకుడు కూడ ఈయనే. ఇప్పుడు కహ్స్య కుమార్ తర్వాతి సినిమాను కూడ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో అక్షయ్ జోడీగా కైరా అద్వానీ, శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్లను అనుకున్నా చివరికి ఆ అఫర్ రకుల్ ప్రీత్ సింగ్ చేతికి దక్కిందట. అలా రకుల్ మంచి ఆఫరే చేజెక్కించుకుందని బాలీవుడ్ వర్గాల బోగట్టా.

సంబంధిత సమాచారం :