ఆన్ స్క్రీన్ మీద సిగరెట్ తాగడంపై రకుల్ వివరణ

ఆన్ స్క్రీన్ మీద సిగరెట్ తాగడంపై రకుల్ వివరణ

Published on Jul 17, 2019 12:49 AM IST

‘మన్మథుడు 2’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఆమె పాత్ర తాలూకు టీజర్లో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇంకేముంది నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆన్ స్క్రీన్ మీద సిగరెట్ తాగుతూ పొగ తాగడానికి ప్రమోట్ చేశారు అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు.

వీటిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రకుల్ అలాంటి విమర్శలు గురించి పట్టించుకోను. ఏను సినిమాలో చేసింది అవంతిక పాత్ర. ఆ పాత్ర అలానే భిన్నంగా ఉంటుంది. నిజజీవితం వేరు సినిమా వేరు. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ సిగరెట్ తాగారు. కానీ ఆయన నిజజీవితంలో స్మోకర్ కాదు. పూర్తి శాఖాహారి. ఇలాంటి విమర్శల్ని పట్టించుకోవడం కంటే ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి అన్నారు.

నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు. ఆగష్టు 9వ తేదీన చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు