మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో రకుల్ ప్రీత్..?

మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో రకుల్ ప్రీత్..?

Published on Feb 17, 2015 3:16 AM IST

Rakul-Preet-and-mahesh-babu
శృతి హాసన్, సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క.. వంటి అగ్ర హీరోయిన్లు అందరు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టేశారు. తెలుగులో హీరోయిన్ల కొరత ఉండడంతో ‘1 నేనొక్కడినే’ కోసం వెతికి వెతికి కృతి సనన్ ను వెండితెరకు పరిచయం చేశారు దర్శకుడు సుకుమార్. మహేష్ బాబు నటించే ప్రతి సినిమాకు ముందు హీరోయిన్ ఎవరనే చర్చ కామన్ అయిపొయింది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకేక్కబోయే ‘బ్రహ్మోత్సవం’లో హీరోయిన్ గురించి ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుతో జోడి కట్టే అవకాశం కొట్టేసిందట. వీరిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అని సమాచారం.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అనతికాలంలో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటుంది. ‘కిక్ 2’, ‘పండగ చేస్కో’ సినిమాలలో నటిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త సినిమాలలో ఆమె హీరోయిన్.

తాజా వార్తలు