మొదలైన రకుల్ ప్రీత్ సింగ్ కొత్త సినిమా !
Published on Jun 27, 2018 10:54 am IST

తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా తమిళంలో మాత్రం భారీ ఆఫర్లతో దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే సూర్య, సెల్వ రాఘవన్ ల సినిమా, కార్తితో ఒక సినిమా చేస్తున్న రకుల్ మరొక స్టార్ హీరో శివ కార్తికేయన్ తో కూడ ఒక సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజే పూజా కార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రీకరణలో పాల్గొననున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ సినిమా రూపొందనుంది. ‘నీట్రు నాళై’ ఫేమ్ రవి కుమార్ ఈ సినిమా డైరెక్ట్ చేయనుండగా ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు. 24 ఏఎమ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook