‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ లో బిగ్ హిట్ అందుకున్న అందాల భామ రాకుల్ ప్రీత్ సింగ్. గత సంవత్సరం తెలుగులో మూడు సినిమాలు చేసి అందులో లౌక్యం తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. అలాగే గత సంవత్సరం హిందీలో కూడా ‘యారియాన్’ అనే సినిమా చేసి అక్కడా విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం మోస్ట్ ప్రామిసింగ్ ఫీమేల్ డెబ్యూ గా రెనాల్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ కి నామినేట్ అవడంతో రాకుల్ ఆనందంగా ఉంది.
రకుల్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘నా ఫస్ట్ హిందీ మూవీ ద్వారా బెస్ట్ న్యూ కమర్ అవార్డు నామినేషన్ కి సెలెక్ట్ అయ్యింది. థాంక్స్ స్టార్ గిల్డ్ అవార్డ్స్, థాంక్స్ టు యారియాన్’ టీం అని రకుల్ ట్వీట్ చేసింది. ఈ అవార్డు కోసం అదే సంవత్సరం బాలీవుడ్ లో పరిచయమైన ‘1-నేనొక్కడినే’ భామ కృతి సనన్ పోటీ పడుతోంది. కృతి సనన్ హీరోపంతి సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రసతుతం తెలుగులో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. పండగ చేస్కో, కిక్ 2 సినిమాలతో పాటు ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ నటించనుంది.


