వైవిధ్యమైన పాత్రలో రకుల్ !

వైవిధ్యమైన పాత్రలో రకుల్ !

Published on Nov 21, 2018 9:43 PM IST


రకుల్ ప్రీత్ తన కెరీర్లో మొదటిసారిగా ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తుంది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రంలో రకుల్ ఖగోళ శాస్త్రవేత్త గా నటిస్తుందని సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని ‘ఇంద్రు నేత్రు నాళై’ ఫేమ్ రవి కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 24ఏఎమ్ స్టూడియోస్ పతాకం ఫై ఆర్ డి రాజా నిర్మిస్తున్నారు.

భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఇక రకుల్ ఈ చిత్రంతో పాటు సూర్య సరసన ‘ఎన్జీకె’ చిత్రంలో అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు