నితిన్ కు జోడిగా రకుల్ ఫిక్స్ !

Published on Apr 23, 2019 8:52 am IST


యంగ్ హీరో నితిన్ మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించనున్నాడు. ఇటీవల వరుసగా మూడు సినిమాలను చేయనున్నాని నితిన్ ప్రకటించాడు. అందులో సాహసం ఫేమ్ చంద్ర శేఖర్ యేలేటి తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది.

ఇక సినిమా తో పాటు నితిన్ ,వెంకీ కుడుములతో భీష్మ అనే చిత్రాన్ని చేయనున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి ఉండగా స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో యేలేటి సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇక ఈ రెండు చిత్రాల తరువాత కృష్ణ చైతన్య తో సినిమా చేయనున్నాడు నితిన్. సో నితిన్ మరో ఏడాది వరకు ఫుల్ బిజీ అన్నమాట.

ఇక రకుల్ మళ్ళీ తెలుగులో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2 లో నటిస్తుంది. ఈచిత్రం యొక్క షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ను పూర్తి చేసి నితిన్ -యేలేటి సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది రకుల్.

సంబంధిత సమాచారం :