పుణ్య క్షేత్రాలు సందర్శిస్తున్న స్టార్ హీరోయిన్

rakul 1

రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మన్మథుడు 2 ఘోరంగా ఫెయిల్ అవగా హిందీలో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో చేసిన దే దే ప్యార్ దే మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో చేసిన దేవ్, ఎన్ జి కె రెండు ప్లాప్ గా నిలిచాయి. ఇక తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ మార్ జవాన్ కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. ఐతే విజయాలు దక్కకపోయినా ఆమె బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో అనేక ఆఫర్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఆమె హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, కమల్ హాసన్ హీరోగా శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. మరో రెండు బాలీవుడ్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. 2020 లో ఆమె క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఏడాది మూడు రోజులలో పూర్తి కానుండటంతో రకుల్ తల్లిదండ్రులతో కలిసి అమృత్ సర్ నందు గల గోల్డెన్ టెంపుల్ సందర్శించారు. పంజాబీ కుటుంబానికి చెందిన రకుల్ రాబోయే సంవత్సరం తన కెరీర్ బాగుండాలని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించినట్లు తెలుస్తుంది.

Exit mobile version