ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ పాత్ర రివీల్ అయింది !

Published on Jul 18, 2018 2:16 pm IST

దర్శకుడు క్రిష్ నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి షూటింగ్ మొదలైన ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర కూడా ఉందట. ఇప్పుడు ఆ పాత్రలోనే రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మహానటి సావిత్రి పాత్రలో మరోసారి కీర్తి సురేష్ కనిపించనుంది. నందమూరి తారకరామారావుగారి పక్కన మహానటి సావిత్రిగారు, శ్రీదేవి చాలా సినిమాల్లో కలిసి నటించారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో వారి ప్రస్తావన ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :