ఎనర్జిటిక్ హీరో కోసం కొత్త క్యారెక్టరైజేషన్ !

ఎనర్జిటిక్ హీరో కోసం కొత్త క్యారెక్టరైజేషన్ !

Published on Jan 18, 2019 1:15 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమాకి సంబంధించి తాజా సమాచారం ప్రకారం, పూరి ‘ఇస్మాట్ శంకర్’ స్క్రిప్ట్ పూర్తి చేశారు. జనవరి 23వ తేదీన ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది. అలాగే జనవరి 24న నుండి రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. పూరి, ఎనర్జిటిక్ హీరో కోసం తన శైలిలో ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ను రాశాడట.

ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడిదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు