
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం స్టార్ట్ చేసిన నాటి నుంచి పెద్ద గ్యాప్ తీసుకోకుండా శరవేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం మొదలైన రోజే సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నాం అని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. దాని ప్రకారమే ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఎస్ఎస్ తమన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ రషెస్ మరియు టీం స్పీడ్ చూసిన తమన్ సినిమా చాలా బాగా వస్తోందని తెలిపాడు. రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కృతి కర్భంద చరణ్ సిస్టర్ గా కనిపించనుంటే, నదియా చరణ్ కి తల్లిగా కనిపించనుంది. బ్రహ్మాజీ హీరోగా కనిపించనున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

