రాజమౌళి సినిమా వివరాలను చెప్పొద్దన్నారు : చరణ్


స్టార్ డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన కూడ చేశారు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో నిజమైన అప్డేట్స్ ఏమిటో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉబలాటపడుతున్నారు.

ఈ నైపథ్యంలో త్వరలో విడుదలకానున్న ‘రంగస్థలం’ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా మల్టీ స్టారర్ గురించిన ఏదైనా ఒక విశేషాన్ని చెప్పుమనగా చరణ్ వెంటనే రాజమౌళి తనకు ఫోన్ చేసి సినిమా గురించి ఎలాంటి వివరాలు చెప్పవద్దని అన్నారని, అసలు మాక్కూడ ఆయన ఇంకా ఏం చెప్పలేదని, త్వరలోనే అందరం కూర్చుని చర్చించుకుంటామని అన్నారు.