ఫోటో మూమెంట్ : “RRR” ఈవెంట్ కి ముందు ఎన్టీఆర్, చరణ్ ల బ్రోమాన్స్

Published on Dec 19, 2021 2:39 pm IST

ఈరోజు మన ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” చిత్రం తాలూకా మొట్ట మొదటి బిగ్గెస్ట్ మరియు మొట్ట మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆల్రెడీ భారీ సెట్టింగ్స్ నడుమ ఈ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ గ్రాండ్ ఈవెంట్ కి గాను బాలీవుడ్ దిగ్గజ నటులతో పాటుగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా హాజరు కానున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరు హీరోలు ముంబై లో ల్యాండ్ కూడా అయ్యారు.

మరి ఇంకా అక్కడ చాలా టైం ఉండగా ఈవెంట్ స్టార్ట్ కాకముందు ఆ ప్రాంగణంలో కలిసి ముచ్చట్లు పెట్టుకున్న ఓ పిక్ ఒకటి బయటకి వచ్చి వైరల్ అవుతుంది. మొన్నామధ్య రాజమౌళి చెప్పిన బ్రోమాన్స్ ముందు సిల్వర్ స్క్రీన్ లో కన్నా ఇక్కడ ఆఫ్ లైన్ లోనే ఎంతో బాగా కనిపిస్తుంది. దీనితో ఇద్దరు హీరోల అభిమానులు సహా మూవీ లవర్స్ కి ఈ ఫోటో ఎంతగానో నచ్చేసింది.

సంబంధిత సమాచారం :