ఫోటో మూమెంట్: తమ క్లిం కారాని మొదటి సారి చూపించిన చేసిన చరణ్, ఉపాసన దంపతులు

ఫోటో మూమెంట్: తమ క్లిం కారాని మొదటి సారి చూపించిన చేసిన చరణ్, ఉపాసన దంపతులు

Published on Jun 20, 2026 7:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో తన నట వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన లెగసిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తనకి కూడా మెగాస్టార్ లానే మొదట లక్ష్మీదేవి లాంటి బుజ్జాయి పుట్టి రామ్ చరణ్, ఉపాసన దంపతులును తలిదండ్రులుగా చేసింది.

అలా క్లిం కారాగా నామకరణం చేసుకున్న తమ కూతురుని ఇప్పుడు వరకు చరణ్, ఉపాసనలు అధికారికంగా ముఖాన్ని చూపించి ప్రపంచానికి పరిచయం చేసింది లేదు. కానీ ఎట్టకేలకు ఈ పుట్టినరోజుకి మాత్రం క్లిం కారాని మొదటిసారి రివీల్ చేసి అందరికీ పరిచయం చేస్తూ పుట్టినరోజు బహుమానం అందించారు.

దీనితో వీరి ముగ్గురి ఫోటో పిక్ ఆఫ్ ది డే గా మారింది. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు