హుదుద్ బాధితులకు 15లక్షల విరాళం ఇచ్చిన రామ్ చరణ్

హుదుద్ బాధితులకు 15లక్షల విరాళం ఇచ్చిన రామ్ చరణ్

Published on Oct 14, 2014 1:42 PM IST

ramchran
రెండు రోజుల క్రితం ప్రకృతి సృష్టించిన విలయ తాండవంలో వైజాగ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ వరద బాధితులకు సాయం చెయ్యడం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ విష్ట్యంలో ప్రజలు, ప్రభుత్వమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హుదుద్ సైక్లోన్ వరద బాధితుల సహాయార్ధం 15 లక్షలు రిలీఫ్ ఫండ్ కి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తన అభిమానులు ఈ సైక్లోన్ బాధితులకు సాయం చెయ్యడంలో బ్భాగ్స్వాములు కావాలని కోరారు. రామ్ చరణ్ మాత్రమే కాకుండా మంచు మనోజ్ కూడా ఈ సైక్లోన్ బాధితులకు సాయం చెయ్యడం కోసం తన టీం తో కలిసి వైజాగ్ వెళ్ళారు. ఇది చూసి మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చి ఈ సైక్లోన్ బాధితులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు