‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో చరణ్.. పిక్ వైరల్ !

‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో చరణ్.. పిక్ వైరల్ !

Published on Jun 21, 2021 10:41 AM IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు పోస్ట్ ఫోన్ అయిన షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. కాగా రామ్ చరణ్ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ రోజు నుండి తన సీన్స్ కోసం షూటింగ్ చేయనున్నాడు. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్‌ మధ్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్, రామ్ చరణ్ స్టైల్ కోసం సెట్ కి వచ్చాడు. ఈ సందర్భంగా హకీమ్ తో చరణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది. ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు