రామ్ చరణ్ సినిమాకి చిరంజీవి సినిమా టైటిల్ ?

Published on Sep 25, 2018 4:31 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలను అజ‌ర్ బైజాన్‌ అనే దేశంలో తెరకెక్కిస్తున్నారు. తూర్పు ఐరోపాలోని పెద్ద దేశంగా ఉన్న అజ‌ర్ బైజాన్‌ లో మంచి లొకేష‌న్లు ఉన్నాయని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తుంది చిత్రబృందం.

కాగా తాజాగా ఈ చిత్రం టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి హీరోగా 1989లో వచ్చిన ‘స్టేట్ రౌడీ’ సినిమా టైటిల్ నే, ఇప్పుడు చరణ్ – బోయపాటి చిత్రానికి పెడుతున్నారని తెలుస్తోంది. బోయపాటి సినిమాల శైలిలోనే.. ఈ సినిమా కూడా పక్కా మాస్ మసాలా అంశాలతో.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే టైటిల్ విషయంలో చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More