‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది

‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది

Published on May 9, 2026 9:01 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. దీనిపై ఎలాంటి హైప్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. అయితే దీనికి ముందు రామ్ చరణ్ హీరోగా చేసిన డిజప్పాయింటింగ్ సినిమానే ‘గేమ్ ఛేంజర్’. మావెరిక్ దర్శకుడు శంకర్ లాంటి దర్శకుడు తీసిన ఈ సినిమా మినిమమ్ వసూళ్లు కూడా అందుకోలేక చతికిల పడింది.

అయితే ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకుంటే పెద్ది గాడి ప్రళయం ముందు గేమ్ ఛేంజర్ ఏమాత్రం నిలవలేకపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రీసేల్స్ లో గేమ్ ఛేంజర్ యూఎస్ మార్కెట్ లో దారుణంగా డిజప్పాయింట్ చేసింది. సినిమా రేపు విడుదల ఉంది అనగా కూడా భారీ జంప్ లు లాంటివి ఆ సినిమా చూడలేదు.

కానీ ఇప్పుడు పెద్ది పరిస్థితి అలా అసలు మొదలు పెట్టడమే రికార్డు రెస్పాన్స్ తో మేనియా మొదలైంది. మొదటి రోజుకే ఏకంగా లక్షన్నర డాలర్స్ కి పైగా గ్రాస్ వచ్చేసింది. సో గేమ్ ఛేంజర్ లైఫ్ టైం నార్త్ అమెరికా వసూళ్లు పెద్ది సినిమా ముందే బ్రేక్ చేసేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పొచ్చు. సో రామ్ చరణ్ కంబ్యాక్ మాత్రం ఊహించని రేంజ్ లో రీసౌండ్ చేయబోతుంది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు