సల్మాన్ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన చెర్రీ!

సల్మాన్ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన చెర్రీ!

Published on Oct 29, 2015 1:40 AM IST

salman-and-ram-charan
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా తెలుగులో ‘ప్రేమ లీల’ పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక తెలుగు వర్షన్‌లో సల్మాన్ ఖాన్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం ప్రేమ లీల విషయంలో ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చిన అంశం.

ఈమధ్యే తెలుగు వర్షన్‌ డబ్బింగ్‌ను మొదలుపెట్టిన చరణ్, నేటితో మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సూరజ్ భర్జత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించింది. సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సల్మాన్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు గతంలో తెలుగులోనూ మంచి విజయం సాధించడం, రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం ఈ సినిమాకు ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశాలు. నవంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు