కియారా, సిద్ధార్థ్ లకి చరణ్ స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Feb 8, 2023 8:00 am IST

లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ లు వివాహ బంధంతో అయితే ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లిగా గ్రాండ్ గా అయితే రాజస్థాన్ లో తమ వివాహం జరిగింది. అనేకమంది సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలియజేయగా కియారా అద్వానీ యువ జంటకి అయితే తన కో స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ తెలిపాడు.

తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కియారా మరియు సిద్ధార్థ్ ల మ్యాచ్ స్వర్గంలో నియమించబడింది అని ఇద్దరికీ తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తాను వారికి తెలిపాడు. దీనితో చరణ్ చరణ్ మరియు కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కియారా అయితే చరణ్ తో రామ్ చరణ్ కెరీర్ 15వ సినిమాని చేస్తుండగా ఆల్రెడీ వీరి కాంబోలో వినయ విధేయ రామ చిత్రం వచ్చింది.

సంబంధిత సమాచారం :