రామ్ చరణ్ స్టార్ డమ్ ఏ స్థాయిదో నిరూపించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల పరంగా నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేయగా తాజాగా మరొక ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎం సింగిల్ స్క్రీన్ టాప్ గ్రాసర్ గా ఇన్నాళ్లు మొదటి స్థానంలో రూ.1.61 కోట్ల గ్రాస్ తో మహేష్ బాబు యొక్క ‘పోకిరి’ ఉండగా ఆ రికార్డుని దాదాపు 12 ఏళ్ల తర్వాత నిన్న 89వ రోజు రన్ తో ‘రంగస్థలం’ బ్రేక్ చేసింది. 89 రోజులకుగాను చరణ్ సినిమా దాదాపు రూ.1.62 కోట్లను అందుకుని దిగ్విజయంగా నడుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో చరణ్ కనబర్చిన నటనకు గాను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి సినిమాను సూపర్ సక్సెస్ చేశారు.


