రామ్ చరణ్ గట్స్.. ఏ సినిమాకి పడని కష్టం!

రామ్ చరణ్ గట్స్.. ఏ సినిమాకి పడని కష్టం!

Published on Jun 4, 2026 9:03 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. భారీ బడ్జెట్ తో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఇది కాగా అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంతో కీలకమైన సినిమా. ఆ అంచనాలకి తగ్గట్టుగా సాలిడ్ టాక్ ని ప్రీమియర్స్ తోనే పెద్ది అందుకోగా ఇందులో కొన్ని హైలైట్స్ కోసం కూలంకషంగా మాట్లాడుకుంటే అందులో మొదటిగా రామ్ చరణ్ కోసమే చెప్పుకోవాలి.

అసలు ఇలాంటి సబ్జెక్టుని ఓ స్టార్ హీరో ఒప్పుకోడానికి చాలా గట్స్ ఉండాలని దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పాడు. ఇదైతే నూటికి నూరు శాతం నిజమే. ఈ తరహా సబ్జెక్టుని ఓ స్టార్ హీరో ఒప్పుకొని చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనితో పాటుగా ‘సినిమాకి ప్రాణం పెట్టేసాడు’ అని చాలా మంది అంటుంటారు. దీనికి అసలు నిర్వచనంగా రామ్ చరణ్ కనిపిస్తాడు.

ఈ చిత్రానికి మాత్రం తాను పడిన కష్టం చూసే ఆడియెన్స్ కూడా ఫీలవుతారు. అంత పెద్ద స్టార్ నటుడు, చిరంజీవి కొడుకు ఇంత కష్టం అవసరమా అనే భావన కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రేంజ్ లో పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం కనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం రామ్ చరణ్ కి అంతకు మించిన మార్కులు ఇవ్వాల్సిందే.

తాజా వార్తలు