ముంబైలోనే రామ్ చరణ్ మకాం

ముంబైలోనే రామ్ చరణ్ మకాం

Published on Sep 12, 2019 8:00 PM IST

ఇప్పుడు భారీ వ్యయంతో రూపొందే మన తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్ కూడా ప్రధానమైపోయింది. ఇన్నాళ్లు సౌత్, ఓవర్సీస్ వసూళ్ల మీదే దృష్టి పెట్టిన మనవాళ్లు ‘బాహుబలి, కే.జి.ఎఫ్, సాహో’ చిత్రాలకు హిందీలో లభించిన ఆదరణ చూసి అక్కడి మార్కెట్ మీద పెద్ద కన్నే వేశారు. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న భారీ బడ్జెట చిత్రం ‘సైరా’.

మొదటి నుండి హిందీ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకునే సినిమాను రూపొందించారు చిరు, రామ్ చరణ్. విడుదల దగ్గరపడుతుండటంతో చరణ్ స్వయంగా రంగంలోకి దిగి హిందీ విడుదల, ప్రచార భాద్యతల్ని చూసుకుంటున్నారు. పూర్తిగా ముంబైలోనే మకాం పెట్టి ఎలా ప్రమోషన్స్ చేస్తే బాగుంటుందో ప్లాన్ చేసుకుంటున్నారు.

మొత్తానికి పెట్టిన రూ.270 కోట్ల వ్యయంలో సగాన్ని హిందీ నుండే రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండటం హిందీ మార్కెట్ పరంగా బాగా కలిసొచ్చే అంశం. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు