చరణ్ కు గాయం .. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి బ్రేక్ !

Published on Apr 3, 2019 4:50 pm IST

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం పూణే లో జరుగుతుంది. అయితే నిన్న జిమ్ లో రామ్ చరణ్ గాయపడడంతో ఈ షెడ్యూల్ ను వాయిదావేశారు. మళ్ళీ మూడు మూడు వారాల తరువాత తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నాడు చరణ్.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. జ అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 350 కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :