“RC15” ఫస్ట్ లుక్, శంకర్ పై చరణ్ నుంచి ఫ్రెష్ డీటెయిల్స్.!

“RC15” ఫస్ట్ లుక్, శంకర్ పై చరణ్ నుంచి ఫ్రెష్ డీటెయిల్స్.!

Published on Nov 29, 2022 1:53 PM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఈ సినిమా విషయంలో మిగతా ఇండియన్ ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ తన విజన్ తో ఎలా ఉండబోతుంది ఈ సినిమా ముఖ్యంగా ఫస్ట్ లుక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దీనిపై లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ దీనిపై చేసాడు. శంకర్ సర్ ని 92 నుంచి చూస్తున్నాము. రాజమౌళి గారే శంకర్ ని ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అన్నారు అలాంటి డైరెక్టర్ తో వర్క్ చెయ్యడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని శంకర్ నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు.

అలాగే ఫస్ట్ లుక్ విషయంలో నేను కూడా అందరి ఫ్యాన్స్ లానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని శంకర్ గారిని అడుగుతున్నానని చెప్పాడు. అయితే శంకర్ గారు కూడా ఓ మార్కెటింగ్ జీనియస్ తనకి ఎప్పుడు ఎమ్ చెయ్యాలో తెలుసని సినిమాపై శంకర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు