బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా ‘దబాంగ్ 3’ డిసెంబర్ 20వ తేదీన హిందీతో పాటు తెలుగునాట కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. అందుకే చిత్రబృందం తెలుగులో ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు.
కాగా ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… ‘హైదరాబాద్ ప్రజలు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. హిందీలో నా సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యేవి. మంచి రెస్పాన్స్ వస్తుండేవి. ఆ రెస్పాన్స్‌ను చూసి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని దబాంగ్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. రామ్ చరణ్ నాకు ఎంతో సన్నిహితుడు. నా చిన్నతమ్ముడిగా భావిస్తాను. చిరంజీవిగారితో ఎంతో సన్నిహితం ఉంది. వెంకటేశ్‌గారితో 25ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రభుదేవాగారు చక్కగా డైరెక్ట్ చేశారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏపీ, తెలంగాణల్లోని ముఖ్యమైన అన్ని చోట్లా హిందీ, తెలుగు రెండు వెర్షన్లు విడుదలవుతాయి. సల్మాన్ ఖాన్ కు సాధారణంగానే హైదరాబాద్ లాంటి సిటీల్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ. తెలుగు వెర్షన్ కూడా ఉండటంతో అది మరింత పెరుగుతుంది.
