ఈ నెలాఖరు వరకు కన్యాకుమారి ఉండనున్న రామ్ చరణ్ టీం

Published on Mar 2, 2014 7:00 pm IST

Ram-Charan-and-Krishna-Vams
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా – క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతోంది. నాగేర్సిఒల్, కన్యాకుమారిలోని అందమైన లోకేషన్స్ లో షూట్ చేస్తున్న ఈ షెడ్యూల్ ఈ నెల 25 వరకు అక్కడే జరగనుంది. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చి మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.

ఆ తర్వాత షెడ్యూల్ పొల్లాచ్చిలో జరగనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కి బాబాయ్ గా శ్రీ కాంత్, తాతయ్యగా తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఫస్ట్ లుక్ తో పాటు ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :