మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యాక్షన్ కామెడీ స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ డీటైల్స్ ని తెలియజేసారు. ‘నా నెక్స్ట్ సినిమాలో ఇప్పటికే రెండు పాటలను, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ మరియు కొన్ని సన్నివేశాలను షూట్ చేసాం. నా న్యూ టీం ఎనర్జీ విషయంలో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.. థాంక్యూ శ్రీను వైట్ల గారు’ అని రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసారు.
రామ్ చరణ్ సరసన మొదటి సారిగా టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బంద, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


