
టాలీవుడ్ మాస్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యాక్షన్ కి కామెడీని కలిపి చెప్పగల శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ మరియు హీరోలకి డూప్ గా కనిపించే పాత్రలో ఆకట్టుకోనున్నాడని ఇది వరకే తెలియజేశాం. రామ్ చరణ్ చేసిన రిస్కీ స్టంట్స్ కి సాంపుల్ గా చిరు బర్త్ డే కానుకగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో రామ్ చరణ్ చేసిన స్టంట్స్, చరణ్ మాస్ అప్పియరెన్స్ సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు బాగా నచ్చేసింది.
షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ పరిశీలిస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇప్పుడు అదే టైటిల్ ని రామ్ చరణ్ టీం ఖరారు చేసింది. తాజాగా ఈ చిత్ర టీం ఫైనల్ గా ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్. రామ్ చరణ్ ఈ సినిమాలో బ్రూస్ లీకి ఫ్యాన్ గా కనిపించడమే కాకుండా తన కుడి చేయిపై బ్రూస్లీ టాటోతో కనిపిస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.

