మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే పెద్ది. మంచి హైప్ ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వదిలిన ఫస్ట్ సింగిల్ తో మొత్తం అంతా ఆ ట్రాన్స్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది. మెగాపవర్ స్టార్ షూట్ కోసం. ఇప్పుడు దేశ రాజధానికి స్టార్ట్ అయ్యాడట.
బుచ్చిబాబు లేటెస్ట్ గా ప్లాన్ చేసిన షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ అయితే షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్టే అట. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా మార్చ్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రాబోతుంది.
