ఏపీలో ‘పెద్ది’ ప్రీమియర్స్ టికెట్ ధర, టైమింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

ఏపీలో ‘పెద్ది’ ప్రీమియర్స్ టికెట్ ధర, టైమింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on May 29, 2026 8:06 AM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవియేటెడ్ చిత్రం “పెద్ది” గ్రాండ్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా విజయం కోసం టాలీవుడ్ నిర్మాతలు సహా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే పెద్ది సినిమా గ్రాండ్ గా జూన్ 3 ప్రీమియర్స్ నుంచే షోస్ మొదలు కానున్నాయి అని అందరికీ తెలిసిందే. అయితే ఏపీ వరకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అందుకు సంబంధించిన ధర మరియు పెద్ది ప్రీమియర్స్ టైమింగ్ ఇప్పుడు రివీల్ అయ్యింది.

పెద్ది ప్రీమియర్స్ టికెట్ ధర ఎంతంటే!

ఆంధ్రాలో పెద్ది ప్రీమియర్ టికెట్ ధరని ఓజి రేంజ్ లో 1000 రూపాయలు కాకుండా రిలీజ్ రోజుకి ముందే ఎంటర్టైన్మెంట్ గా 600 రూపాయల ధరకి ఫిక్స్ చేశారు. సో జూన్ 3న 600 టికెట్ ధర పెద్ది కి ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ హైక్స్ తో కొద్ది రోజులు పాటుగా సినిమా థియేటర్స్ లో కొనసాగనుంది.

రాత్రి ఏ సమయం నుంచి పెద్ది ఆట మొదలు?

జెనరల్ గా పెద్ద హీరోల ప్రీమియర్స్ షోస్ ని అంత త్వరగా వేయరు. తెల్లవారుజాము లేదా, రాత్రి 1 గంట సమయంలో మహా అయితే తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యాయి. కానీ ఏపీలో మాత్రం పెద్ది షోస్ రాత్రి 8 గంటల నుంచే మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒకింత రేర్ కేస్ కానీ మేకర్స్ మాత్రం గట్టి నమ్మకంగానే ఉన్నారని చెప్పొచ్చు.

సో ఈ ప్రీమియర్స్ లో పెద్ది వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు