మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన హిట్ చిత్రమే “పెద్ది”. మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో సోలోగా ఆల్రెడీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఇండియా వైడ్ గా బుకింగ్స్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ ని ఇప్పుడు అందుకోవడం విశేషం.
రెండు టాప్ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్ మై షో అలానే డిస్ట్రిక్ట్ లలో ఇప్పుడు వరకు 5 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ జరిగినట్టు మేకర్స్ తెలిపారు. ఇక మొత్తం 5 రోజుల్లో 53 లక్షలకి పైగా టికెట్ సేల్స్ అయ్యినట్టు రివీల్ చేయడం విశేషం. దీనితో పెద్ది ముందు ముందుకి మరింత స్ట్రాంగ్ నంబర్స్ నమోదు చేసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్ అలానే దివ్యెందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలానే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.
BOX OFFICE CHAMPION #PEDDI continues sensational bookings 💥💥
5.3 MILLION+ TICKETS SOLD on Book My Show and District alone 🔥
Book your tickets now!
🎟️ https://t.co/hBzGpimDwPMega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/vEzaQ48cyo
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 9, 2026


