నైజాంలో ‘పెద్ది’ డే 1 వసూళ్లు ఎంతంటే!

నైజాంలో ‘పెద్ది’ డే 1 వసూళ్లు ఎంతంటే!

Published on Jun 5, 2026 12:27 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రమే “పెద్ది”. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రీమియర్స్ తోనే సాలిడ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో దుమ్ము లేపింది. ఇలా వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో కూడా గట్టి ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం పెద్ది ఒక్క రోజులోనే 18.32 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబట్టినట్టు చెబుతున్నాయి. కేవలం షేర్ నే 18 కోట్లకి పైగా అంటే భారీ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. డే 2 వసూళ్లు కూడా గట్టిగానే ఉండేలా ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తుంది. సో ఈ నంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాని వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు