మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సాంగ్ పట్ల కూడా మంచి హైప్ నెలకొనగా ఇప్పుడు పెద్ది ఫస్టాఫ్ ని మేకర్స్ లాక్ చేసేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ది ఫస్టాఫ్ ని మేకర్స్ లాక్ చేసి రెహమాన్ వద్దకు పంపారట. ఇలా సినిమా ఆర్ ఆర్ పనులు కూడా ఇప్పుడు మొదలైనట్టు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ గా కీలక సన్నివేశాలని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫామెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని సినీ వర్గాల్లో టాక్. సో పనులన్నీ ఫుల్ స్వింగ్ లో వెళుతున్నాయని చెప్పవచ్చు. మరి సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
