చాలా కాలం నుంచి తెలుగు సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా అంచనాలు రీచ్ అయ్యి అంత నిడివి ఉన్నప్పటికీ జనం థియేటర్స్ లో అంత సేపు ఎంజాయ్ చేసే విధంగా కట్ చేయడం ఇంప్రెసివ్ గా మారింది.
అయితే సినిమా నిడివి ఎక్కువ ఉండే కారణంతో చాలా సన్నివేశాలు తీయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆ కట్స్ కూడా మనకి తెలుస్తాయి. దీనితో అభిమానులు అలాంటి సీన్స్ కోసం ఆల్రెడీ డిస్కషన్ మొదలు పెట్టారు. అయితే గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి కూడా మొదటి నిడివితో పాటుగా అదనపు సీన్స్ యాడ్ చేసి విడుదల చేశారు.
ఇప్పుడు ఇదే స్టెప్ ని పెద్ది కి కూడా రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. కాకపోతే పెద్ది లో కొన్ని సీన్స్ తగ్గించి కొత్త సన్నివేశాలు యాడ్ చేస్తారట. ముఖ్యంగా రామ్ చరణ్, జగపతి బాబు ట్రాక్ లో సీన్స్ ని యాడ్ చేస్తారని తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇందులో జాన్వీ కపూర్ పెళ్లి చూపులు సన్నివేశం కూడా యాడ్ చేస్తారేమో చూడాలి.


